kamada ekadasi vratha katha in telugu lyrics . కామదా ఏకాదశి వ్రత కథ
విష్ణుమాసము
(చైత్రశుద్ధ “కామదా” ఏకాదశి )
వరాహ పురాణములోని శ్రీ కృష్ణ _ యుధిష్టిర సంవాదము :
1.kamada ekadasi vratha katha in telugu lyrics: ధర్మరజైన శ్రీ యుధిష్టిర మహారాజు ఓకానొక రోజు భగవంతుడైన శ్రీకృష్ణుడునికి
నమస్కారించి చాలా ప్రీతి తో ఇట్లు అడిగెను. “ ఓ జనార్ధన ! చైత్రశుద్ధ ఏకాదశి కి
ఏమని పేరు ? ఈ ఏకాదశి ని ఆచరించిన ఏమి ఫలితములు కలుగును ? దయతో నాకు చెప్పవలసినది. “ అని కోరగా శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను ఓ మహారాజ ! ఈ ఏకాదశి గురించి ఒక రహస్యమయిన పురాతన కథ కలదు. దానినే నీకు చెప్పబోతున్నాను. శ్రద్ద భక్తితో , మిక్కి నిష్టాపరుడై వినుము.

2.kamada ekadasi vratha katha in telugu lyrics.ఒకానొకప్పుడు దిలిప మహారాజు గురుదేవులైన వసిష్ట మహర్షి ఈ ఏకాదశి వ్రత
మహిమ గురించి అడిగెను. అందులకు వసిష్ఠ మహర్షి ఈ ఏకాదశి పేరు కామదా అని పలికిరి. అగ్ని ఎట్లు కట్టెలను బూడిద చేయగలదో అట్లే ఈ ఏకాదశి వ్రతము నాచరించిన వారికి కొండంత పాపములు భస్మము కాగలవు. కావున ఈ ఏకాదశి వ్రతము తప్పక చేసి తీరవలెను. అని వశిష్ట మర్షి తెలిపెను.
3.kamada ekadasi vratha katha in telugu lyrics: పూర్వకాలములో గాంధర్వలోకములో రత్నపురమును సుమనోహరమయిన ఒక నగరము కలదు. ఆ నగరములో మహాఐశ్వర్యము కలిగిన పున్దరికుడు అను ఒక రాజుగారు ఉండెను. ఎంతో మంది గంధర్వులు,అప్సరసలు మరియు కిన్నేరులచే సేవిమ్పబడుచు ఆ రాజు ఆనందముతో ఉండెడివాడు. ఆ సమయములో లలితా దేవి అను అప్సరస లలితుడు అను గంధర్వుడు కామక్రిడలో ఉండెడివాడు. కొద్ది సమయమము కూడా వారు ఒకరినొకరు దర్శించకుండా నిలువ లేరు .
4.ఒకనాడు ఆ గాంధర్వలోకములో రాజైన పుండరీకుడు చాలా మంది గంధర్వులతో నృత్య గితములతో క్రిదిన్చుచుదేడివారు. కాని ఆ సమయమున లలితుడు
(గంధర్వుడు) తన భార్య సమీపమున లేని కారణముగా అతని కంఠ స్వరము మరియు నృత్య తాలలయములకు భాగము కలిగినది. అది చూసి రాజు పుండరీకుడు మిక్కిలి కోపముతో తాలభంగమునకు కారణమేమని అడిగెను. లలితుడు రాజునకు ఎట్టి సమాధానము చెప్పక మిన్నకుండెను . కానీ అక్కడ వున్న కర్కోటక అను నాగుడు లలితుని విషయము తెలికొని రాజుగారికి ఇట్లు చెప్పసాగెను. మహారాజ లలితుని భార్యయిన లలితాదేవి దగ్గరలేని కారణముగా వినికి తాల –స్వర భంగము గలిగినవి ఈ మాటలు విన్న పుండరీక రాజు ఓ అధమ దురాచారా ! నీవు స్త్రీ వశుడువై సంగిత తాల భంగము చేసినావు కనుక రాక్షస జన్మము పొందుదువు గాక ! కుళ్ళిపోయిన మాంసము నీ యొక్క ఆహారము . అని మిక్కిలి కోపముతో శపించెను .భర్తకి రాజుగారు ఇచ్చిన శాప విషయము తెలుసుకున్న లలితాదేవి, దుఃఖముతో అతడు శృంగి మహర్షి యొక్క ఆశ్రమమునకు వెళ్ళిరి. మహర్షి వారిరువురు నమస్కారించగా, నీవు ఎచ్చటి నుండి వచ్చు చున్నావు ? నీ వివరములు ఏమని అడుగగా అందులకు లలితాదేవి నేను వీరధన్యుడు అనే గంధర్వుని కుమార్తెను . నాపేరు లలిత నాభర్త పుండరీకరాజు శాపము వలన రాక్షస జన్మ పొందినాడు అతనిని నా వెంట తీసుకు వచ్చి నాను .దయయతో వానికి మరల గాంధర్వ జన్మ ఎలా వచ్చునో తెలుపండి. అని కోరెను. ఆమె కోరిక విధముగా వచ్చే చైత్ర మాసము శుద్ధ ఏకాదశి అనగా కామదా ఏకాదశి ఉపవాసముతో భగవన్నామస్మరణ తో నీ యొక్క భర్తకు ఈ వ్రత పుణ్య ఫలమును దానము చేసిన రాక్షస జన్మ పోవును అని తెలిపెను లలితా చాలా సంతోషించి భర్తకు పుర్వయదారూపము కలిగించడానికి నిరహరముతో భగవతే స్మరణ చేస్తే రాత్రి జాగరణతో ఏకాదశి చేసి మరునాడు ద్వారసితో భాగావత్పుజ చేసి సాధువులకు, బ్రాహ్మణులకు,వైష్ణవులకు,అన్నదానము చేసినది.ఆ విధముగా ఆమె చేసిన దాన ఫలమును పొంది లలితుడు తన పూర్వ గంధర్వ రూపమును పొంది వారి లోకమునకు వెళ్ళెను. అచ్చట వారిరువురు మహాసుఖముగా కాలము గడుపుచుండిరి. అని వివరించి శ్రీకృష్ణుడు యుధిష్టురునితో ఓ మహారాజ ! ఈ కామదా ఏకాదాసి వాలే ఇంకా ఏ వ్రతము లేదు. దీనిని ఆచరించిన వారు పునర్జన్మ రహితమయిన విశ్నులోకమును చేరుదురు అని పలికెను.
కామదా ఏకాదశి సమాప్తము
***ఓం నమో భగవతే వాసుదేవాయ****
Comments
Post a Comment
thanks for your comment