నిత్య (ఏకాదశి) , నైమిత్తిక (చాంద్రాయణ) ,vrathslu nomulu
*ॐశ్రీవేంకటేశాయ నమః*
❤️ *వ్రతం అంటే సంస్కృతంలో “ప్రతిజ్ఞ, నియమపాలన, భక్తి “ అనే అర్ధాలు ఉన్నాయి.*
💕 *పెద్దలు చెప్పిన శ్రేష్టమైన విధానాన్ని అనుసరించి మేలైన నియమాలను శ్రద్ధగా అనుష్థానం చేస్తే దాన్ని వ్రతం అంటారు. వ్రతం యొక్క ప్రధానోద్దేశం పుణ్యసముపార్జన.*
❤️ *నిత్య (ఏకాదశి) , నైమిత్తిక (చాంద్రాయణ) , కామ్య (కార్తీక సోమవారం, మార్గశీర్ష లక్ష్మివారం) వ్రతాలని మూడు రకాల వ్రతాలున్నాయి. *
💕 *వాటిలోనూ ఉపవసాదులతో చేసే నివృత్తి వ్రతాలు( నక్తవ్రతాలు, ఏకాదశీ) , ఆర్భాటంగా పూజ, నైవేద్యాది భక్ష్య భోజనాదులతో చేసే ప్రవృత్తి వ్రతాలు (వరలక్ష్మీ, సత్యన్నారాయణస్వామీ వ్రతాలు) ఉన్నాయి. ఆస్తీకం, కపటం లేకపోవడం, నిజం మాట్లాడటం, బ్రహ్మచర్యం, ఇతరత్రా మానసిక వ్రతాలు, ఎవరితో మాట్లాడకుండా వాగ్దోషాలను నియంత్రించే మౌన వ్రతాలు, చిత్తశుద్దికి చేసే చాతుర్మాస్య వ్రతాలు ఇలా ఆస్తీకబుద్ధిని పెంపొందించి దోష నివారణం కోసం చేసే వ్రతాలు కోకొల్లలు. *
💕 *మనకు ప్రతీ పురాణంలోను మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం కొన్ని వ్రతాలు, వాటి నియమాలు చెప్పబడ్డాయి.*
❤️ *మనం ఒక వ్రతం ఆచరిస్తున్నాము అంటే ఆ నియమాలను ఉల్లంఘించకుండా పాటిస్తున్నాం అని. ఈ వ్రతాలు చెయ్యడం వలన మన పాపాలు ప్రక్షాళనం అయ్యి, ఆపదలు తొలగి, దోష నివృత్తి అవుతాయి. *
💕 *ఉదాహరణకు మనం చేసిన ఒక పాపం వలన మనకు కొన్ని రోజులు తిండి తినలేని పరిస్థితి రావచ్చును. పెద్దలు మన చేత ఈ వ్రతం చేయించడం ద్వారా అవశ్యభోక్తమైన ఆ కర్మను దైవదత్తం చేసి అనుభవింపచేసుకుంటున్నాము. ఎప్పుడో దుఃఖపడవలసిన స్థితిని నేడు మనం దైవానికి అనుసంధానం చేసి అనుభవిస్తున్నాం.*
💝 *~తద్వారా ఒక వారం ఉపవాసముండవలసిన పరిస్థితిని ఒక రోజు ఉపవాసం ద్వారా అనుభవించి ఆ పాప భారాన్ని దూరం చేసుకుంటున్నాము. ఒకరోజు మౌన వ్రతం పాటించి మన వాక్కు ద్వారా ఆరోజుకు చెయ్యవలసిన పాపాలను చెయ్యకుండా, మరొక పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ నియమపాలన ఉపకరిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుష్టాన, కర్మ రహస్యాలున్నాయి వ్రతపాలన చెయ్యడం వలన. *
❤️ *సత్యన్నారాయణస్వామివారి వ్రతం లాంటి సంపూర్ణ వ్రతాలలో నవగ్రహాలను ఆవాహనం చేసి పూజించి, అష్టదిక్పాలకులను సంతృప్తి పరచి గ్రహ దోషాలు, మరే ఇతర పీడలను నివారణం చేసుకుంటూ ఉంటాము. సామూహికంగా వ్రతపాలన చెయ్యడం వలన ఒకరికి మరొకరు తోడై, ప్రేరణ అయి, ఇనుమడించిన ఉత్సాహంతో భక్తిభావంతో వ్రతం ఆచరిస్తాము, రెట్టింపు లాభం పొందుతాము.*
💖 *మనం-మన ఆధ్యాత్మికత” పేర ఉన్న మన సత్సంగంలో అధ్యయనం చేసి, ఆకళింపు చేసుకునేందుకు గాను మహత్తరమైన సందేశాలు రోజుకు మూడు నాలుగు మాత్రమే వెలువడుతాయి. గ్రూపులో చేరదలుచుకున్నవారు 9966870447 కి సందేశం పెట్టండి.*
*ఈ సందేశాన్ని అందరూ తమతమ బంధుమిత్రులకూ, అన్ని గ్రూపులకూ ఫార్వార్డ్ చేసి ఆధ్యాత్మిక మార్గానికి అందరినీ తీసుకురండి.*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి.*
❤️ *ఇక పోలి స్వర్గం లాంటి కొన్ని వ్రతకధలలో భావం ముఖ్యం. కర్మ కన్నా అని ఒక చిన్న నిరూపణ చేస్తూ ఉంటారు. అక్కడ కావలసినది అంత ఆర్ద్రత, వ్రతం చేస్తాననే మానసిక బలం, పట్టుదల. అటువంటి స్థితికి చేరాక వారికి కర్మభాగం అంత అన్వయించకపోవచ్చు. కానీ అవన్నీ కేవలం కొన్ని exceptions (మినహాయింపు) మాత్రమే*
💕 *~ఎలాగంటే ఉదాహరణకు ఒక తరగతిలో మంచి తెలివయిన, కష్టపడే తత్వం ఉన్న విద్యార్ధి, మిగిలిన అందరు విద్యార్థులతో కలిసి ఒక గణిత ప్రశ్నకు సమాధానం రాసాడు అనుకుందాము. అతడు పద్ధతి అంతా సరిగ్గా చేసి చివరన సమాధానం రాసేటప్పుడు కొంత తడబడి ఒక విలువ రాయబోయి తప్పు రాసాడు అనుకుందాము. పూర్తిగా 5/5 వెయ్య వలసిన గురువులు ఆ సమాధానం అంతా పరికించి 4.5/5 వేస్తాడు. అలా అని ప్రతీ సారీ కేవలం పద్ధతి మీద శ్రద్ధ పెట్టి సమాధానాలు తప్పు రాస్తుంటే వాడికి 0 చుడతారు. అలాగే ఈ వ్రతాలలో భక్తి భావం ప్రధానంగా కొందరికి వారు చేసిన ఆ వ్రతఫలితం ఇచ్చేస్తాడు భగవంతుడు. అలాగని మనం కూడా మిగిలిన కర్మ వదిలేసి భావం ముఖ్యం అని మనల్ని మనం మోసం చేసుకుని దేవుని టోపీ పెడదామని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. *
❤️ *కాబట్టి భావము ముఖ్యమే, కర్మ ముఖ్యమే. అన్నీ కలిసినప్పుడే అందవలసిన పూర్ణఫలం లభిస్తుంది మనకు.*
*ॐశ్రీవేంకటేశాయ నమః*
Superb
ReplyDeleteSuperb
ReplyDelete