రుక్మాoగద చరితము..rukmogada history in telugu lyrics



రుక్మా౦గద  మహారాజు చరితం

మహారాజు ప్రముకుడు . అతడు తన ప్రజలందరిచేత ఆచరింప చేసి తను ఆచరించి విష్ణు లోకమునకు తిసుకువేల్లెను. ఆ రుక్మా౦గదుని చరితమును కొంచము ఇక్కడ పరిశిలించేదము. మానవుడు ఏదేని శుభ విషయమునందు పూర్ణ నిష్ట తన  జీవితమున  కలిగి యుండేనని అతనికి దానితోనే ముక్తి కలుగుతుంది .అతడు వ్రత నిష్ట లో దృఢముగ నుందునా లేకున్డునా యను పరీక్షను  నిష్టావంతుల యెడల  భగవంతుడు చేయును .ఇంకో విధముగా చెప్పవలేనన్న విపద్దానము నొసంగి భగవానుడు నిస్తాను పుష్టి గావించును . సువర్ణము నెంతగా కాల్చిన నంతగా వన్నె వచ్చును .భగవానుడు అంబరీషుని భక్తి నిస్తాను ఏకాదశి వ్రత నిస్తాను దుర్వాస ముని ద్వార   పరీక్షించెను. అట్లే  రుక్మా ౦గదుని కుడా పరీక్షించి తన వైకుంట ధామము నోసంగెను .

ధర్మతుము, విష్ణు భక్తుడు అగు రుక్మా ౦ గద మహారాజు సప్తద్విపమగు వసున్దరనుఏకాదశి వ్రతమహత్యమును ఎందరో మహాత్ములు ఆచరించి ధన్యులయ్యి విష్ణులోకమును పొందిరి. అందు రుక్మాంగద  ఏకచాత్రదిపత్యము న పరిపాలించెను .అతని ఏకాదశి నిష్ట ఇంతని చెప్పలేము .అతడు ఆ దినమున నెవరిని భోజనం చేయనీ యాడు.ఇంత ఏల?
అతని ఎనుగులకును, గుర్రాలకును మేత వేసేవాడు కాదు. ఏకాదశి ముందు రోజు అతడొక ఏనుగు పై నొక పెద్ద నగారాను నట్టించి సువర్ణ మాయ మగు  డంకా   కోట్టించుచు

 సర్వత్ర ఇట్లు చాటింపు వేయించేవాడు .  ఎనిమిది సంవత్సరములకు పైబడినవారును,ఎనుమది సంవత్సరములకు తగ్గినవారును స్త్రీ ,పురుషులందరును నీవ్రతం చేయకున్నచో శిక్ష కు బ్రత్రులుఅవుదురు .బాలికలు వృద్ధులు,రోగులు తప్ప మిగిలిన వాలందరు ఈ ఏకాదశి వ్రతం చేయవలెను . అతనికి వున్నా రాజ్యం చిన్నది కాదు . స్వప్త ద్వీపాలకు రాజు  అందువలన  భుమండలములో  ఉన్నవారందరును అతని ఆజ్ఞలు మన్నిచేవారు .విష్ణు భక్తుడు అగుటచే అతని  ఆజ్ఞా వుల్లంగించు సాహసం ఎవరికి లేదు అందువలన పృధివి అంత సమస్త స్త్రీ ,పురుషులు అందరు ఏకాదశి వ్రతము చేసేవారు . పొరపాటు అయినా ఆజన వుల్లంగిస్తే వారిని కటినముగా శిక్షించేవారు.ఏకాదశి వరప్ర భ వమున  అందరు  విష్ణు లోకాన్ని పొందారు. యమలోకము పోయే వారు లేరు .భగవానుని కృప వలన అందరు ఏకాదశి వ్రతమును  ఆచరిస్తున్నారు .

Comments

Popular posts from this blog

నలదమయంతుల కథ .Nala Damayanthula kada in telugu lyrics