RAMANANDARAYULA CHAITANYA MAHAPRABHU MILANAMU GOWDIYAMATAM
కదాసారము: మహాప్రభు సింహాచలములమున నరసింహస్వామి ని దర్శించి గోదావరి తీరమున గల విద్యానగారమునకు వచ్చి అక్కడకు స్నానము నకు వచ్చిన రామనందరాయునితో కలిసినాడు రామానందుడు తనను పరిచయము చేసుకునిమహాప్రభును కొన్ని దినములు ఆగ్రమమున (కొవ్వూరు నందు) ఉండమని ప్రార్ధించెను. రామానందుని కోరికను అనుసరించి ఒక వైదికవిప్రుని ఇంట బిక్షను స్వీకరించి ఆగ్రమమున మహాప్రభు ఉండెను.ఆ రోజు సాయంకాలము రామానందుడుసాధారణ వేషము ధరించి మహాప్రభును కలిసి దండవత్ర ప్రాణామములు చేసెను.మహాప్రభు సాధ్య సాధనము తెలుపు శ్లోకము చదువమని రామానందుని అడిగెను. రామానందుడు మొదట సజ్జన సంమతమగు వర్ణాశ్రమధర్మమును
వుల్లేఖించు శ్లోకమును చదివేను. తరువాత క్రమముగ కర్మాఅర్పణము,నిస్కామకర్మ,జ్ఞానమిశ్రభక్తి,జ్ఞానశూన్యశుద్ధభక్తిని సూచించు కొన్ని శ్లోకములను రాయులు పటించెను.రాయలు తరువాత కృష్ణ స్వరూపమును రాధా స్వరూపమును,రసతత్వస్వరూపమును , ప్రేమ తత్వమును వర్ణించెను. రామనందరయులు అడుగగా విస్వరుపమును మహా ప్రభు చుపించేసు.

Comments
Post a Comment
thanks for your comment