నిత్య (ఏకాదశి) , నైమిత్తిక (చాంద్రాయణ) ,vrathslu nomulu
*ॐశ్రీవేంకటేశాయ నమః* ❤️ *వ్రతం అంటే సంస్కృతంలో “ప్రతిజ్ఞ, నియమపాలన, భక్తి “ అనే అర్ధాలు ఉన్నాయి.* 💕 *పెద్దలు చెప్పిన శ్రేష్టమైన విధానాన్ని అనుసరించి మేలైన నియమాలను శ్రద్ధగా అనుష్థానం చేస్తే దాన్ని వ్రతం అంటారు. వ్రతం యొక్క ప్రధానోద్దేశం పుణ్యసముపార్జన.* ❤️ *నిత్య (ఏకాదశి) , నైమిత్తిక (చాంద్రాయణ) , కామ్య (కార్తీక సోమవారం, మార్గశీర్ష లక్ష్మివారం) వ్రతాలని మూడు రకాల వ్రతాలున్నాయి. * 💕 *వాటిలోనూ ఉపవసాదులతో చేసే నివృత్తి వ్రతాలు( నక్తవ్రతాలు, ఏకాదశీ) , ఆర్భాటంగా పూజ, నైవేద్యాది భక్ష్య భోజనాదులతో చేసే ప్రవృత్తి వ్రతాలు (వరలక్ష్మీ, సత్యన్నారాయణస్వామీ వ్రతాలు) ఉన్నాయి. ఆస్తీకం, కపటం లేకపోవడం, నిజం మాట్లాడటం, బ్రహ్మచర్యం, ఇతరత్రా మానసిక వ్రతాలు, ఎవరితో మాట్లాడకుండా వాగ్దోషాలను నియంత్రించే మౌన వ్రతాలు, చిత్తశుద్దికి చేసే చాతుర్మాస్య వ్రతాలు ఇలా ఆస్తీకబుద్ధిని పెంపొందించి దోష నివారణం కోసం చేసే వ్రతాలు కోకొల్లలు. * 💕 *మనకు ప్రతీ పురాణంలోను మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం కొన్ని వ్రతాలు, వాటి నియమాలు చెప్పబడ్డాయి.* ❤️ *మనం ఒక వ్రతం ఆచరిస్తున్నాము అంటే ఆ నియమాలను ఉల్లంఘించకుండా పాటిస్తు...