Kama Dahanam | Kama Dahanam Story | Holi Story | Holi కామ దహనం హోళీ కథ /...

                                        కామ దహన హోళీక  కథ


 

🥀 *కామదహన హోళీ కథ

1.మన భారతీయ హిందూ సాంప్రదాయ, ఆచార వ్యవహారాలలో పండగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేక తిధి,నక్షత్ర రోజులలో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది.ప్రతి
సంవత్సరం ఇది పునారావృతం అవుతుంది. ఒక ప్రత్యేకమైన పండుగను అదే ప్రత్యేకమైన రోజునాడు ఎందుకు జరుపు కోవాలి అనేది జ్యోతిష ఆధారంగా తెలుస్తుంది.ప్రస్తుత హోలీ పండగ అనేది ఎప్పుడు,ఏలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు,నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంధాల ఆధారంగా వివరణ పరిశీలించి చూడగా కామదహనం అనేది పాల్గుణ మాస, పౌర్ణిమ రోజు చేయాలని నిర్ణయం చేసారు,అందుకే కాముని పున్నమి అనే పేరు వచ్చింది.ఈ పండగను యావత్ భారత దేశ ప్రజలు అన్ని ప్రాంతలవారు ఆనందంగా జరుపుకుంటారు.


2పురాణ గ్రంధాల ఆధారంగా చూడగా పరమేశ్వరుని మనసుని పార్వతిదేవిపై మళ్ళించాలని మన్మధుడు పూలభాణం వేసే సరికి అతడిని భస్మం చేస్తాడు ఈశ్వరుడు.మన్మధుని భార్య అయిన రతీదేవి దుఖించగా శివుడు కనికరించి మన్మధునికి శరీరం లేకున్నప్పటికీ సజీ వుడుగా ఉండే వరాన్ని అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు.మన్మధుడు అంటే కాముడు.ఈ కామదహనం అనేది ఫాల్గుణ పౌర్ణిమి రోజున జరిగినది. కావునఈ రోజు పండగగా చేసుకోవడం ఆచారం అయినది. సహేతుకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపోందించుకోవాలనేదే ఈ పండగలోని అంతరార్ధం. కాముడుని పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా మానవజాతికి ఒక సందేశం కనబడుతుంది. కాముడు ప్రతీ మనిషిలోను అదృష్య రూపంలో అంతట వ్యాపించి ఉంటాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న అరిష్డ్వర్గాలైన రాగ,ద్వేష,కామ,క్రోధ,మోహ,మాయ మొదలగు గుణాలను ప్రజ్వరిల్లకుండా అను నిత్యం అదుపు చేసుకుని మనస్సుని అధీనంలో పెట్టుకోవాలని సందేశం కనబడుతుంది. మనిషిలో కోరికలు గుర్రంలా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టి పోతాడు. మనిషిలోని రజో,తామస గుణాలను పారదోలి,సాత్విక గుణంతో జీవిస్తే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుంది. "మనిషిని మహానీయుడిగా మార్చే మహత్తరశక్తి మనస్సుకు ఉంటుంది, ఆ మనస్సుని అధీనంలో పెట్టుకోవడం కేవలం మనిషికే ఉంటుంది". మనిషి యొక్క మనస్సును, శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోగలిగిన వారు మనుషులలో మహానీయులౌతారు.

హోళి పండగను వసంతోత్సవమని, డోలికోత్సవమని, ఫాల్గుణోత్సవమని పిలుస్తారు.శీతకాలపు చలి తగ్గిపోయి ఇంచుమించు వేసవి కాలపు ఎండవేడి ప్రారంభం అయ్యేపర్వం ఈ పండగ వసంతఋతువు ప్రవేశాన్ని తెలియజేస్తుంది. ఈ రోజున పిల్లలు, పాడిపశువుల పంటల సంరక్షణకై దైవాన్ని స్మరించుకుంటారు.

హిరణ్యకశిపుని సోదరి హోళిక మహాశక్తి కలది. అగ్నికూడా ఆమెను కాల్చలేదు. దేవతలపై విజయం సాధించిన గర్వంతో హిరణ్యకశిపుడు భగవంతున్ని పూజించవద్దని ప్రజలను శాసిస్తాడు. తన కోడుకే విష్ణుదేవున్ని ఆరాధించడం వలన తీవ్రకోపోద్రికుడై హరినామస్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని అగ్నిలో ప్రవేశించమని హిరణ్యకశిపుడు హోళికను ఆజ్ఞాపిస్తే ఆమె అలానే చేసింది. విష్ణు భగవానుని నిరంతర స్మరణ ప్రభావంచేత హోళిక తన శక్తులన్ని కోల్పోయి బూడిదయ్యింది. హరినామస్మరణచేస్తూ ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వచ్చేస్తాడు కాబట్టి ఆ సంఘటనకు గుర్తుగా హోళి పండుగను జరుపుకోవడం ఆనవాయితి అయ్యిందని కధనం. ఇలా ఈ పండగ వెనక కధలెన్నిఉన్నా ప్రకృతిలోని మార్పు వలన మానవునిలో ఉండే సప్తధాతువులను ఆధీనంలో పెట్టుకుని సాటి జనులచే ప్రేమ,దయ,మొదలగు కరుణావాత్సల్యంగా మెలగాలనే ఉద్యేశ్యంతో ఏర్పడింది.చిన్న,పెద్ద,ఆడ,మగ,పేద,ధనిక అనే తారతమ్య భేదం లేక అందరిమధ్య స్నేహ భావాన్ని పెంచి మనస్సులను ఆనందింపజేసే రంగుల పండుగనేది మాత్రం యధార్ధం.

చివరగా నా మాట.
హోళీని సాంప్రదాయంగా జరుపుకోండి. పైశాచికంగా రసాయన రంగులు చమురులు వాడి ఇతరుల ఆరోగ్యాన్ని కళ్ళను నాశనం చేయకండి. ఇలా పైశాచిక చర్యల ద్వారా పొందే ఆనందాన్ని రాక్షసానందం అంటారు. మన పండుగలన్నీ పర్యావరణానికి సమాజానికి శ్రేయస్సును కలిగించేవే. వాటి అంతరార్ధం తెలుసుకొని ఆచరించండి.
ఫాల్గుణ పౌర్ణమి రోజే లక్ష్మీ దేవి జన్మించింది. ఈరోజు చక్కగా లక్ష్మీ ఆరాధన చేయండి.


Comments

Popular posts from this blog

నలదమయంతుల కథ .Nala Damayanthula kada in telugu lyrics